Fri Mar 20 2026 03:30:50 GMT+0530 (India Standard Time)
భూములివ్వని రైతులకు నారాయణ లాస్ట్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. జరుగుతున్న పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఉండవల్లి వద్ద బకింగ్ హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులుమంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసoధానించే పనుల్లో మరో 4.5 ఎకరాలు భూ సమస్య ఉందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. భూసేకరణ చేసేందుకు అవకాశం ఉన్నా మరో నెల రోజులు సమయం ఇస్తున్నామని నారాయణ తెలిపారు. ఏప్రిల్ 9నాటికి భూసమీకరణ కు 4.5ఎకరాల రైతులు ముందుకు రాకుంటే భూసేకరణ చేపడతామని హెచ్చరించారు.
నెల రోజులు మాత్రమే సమయం...
భూ సమీకరణకు సహకరించాలని రైతులను ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నామని, అందుకనుగుణంగానే మరో నెల రోజుల సమయం ఇచ్చామని, బకింగ్ హాం కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థలు చెబుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. బకింగ్ హాం కెనాల్ కంటే ముందు మరో రెండు స్టీల్ బ్రిడ్జ్ లు గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై రానున్నాయి. ఈ రెండు బ్రిడ్జ్ లు కూడా పూర్తయితే సీడ్ యాక్సిస్ రహదారి పూర్తయినట్లేనని మంత్రి నారాయణ తెలిపారు.
Next Story

