Fri Mar 20 2026 03:30:50 GMT+0530 (India Standard Time)
Chandrababu : పుట్టా మహేష్ వ్యవహారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంఛార్జి మంత్రితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంఛార్జి మంత్రితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. హాజరైన కలెక్టర్, ఎస్పీ, ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా హాజరయ్యారు. నేతల భేటీలో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.యువకుడని, రాజకీయ నేపథ్యం ఉందని పుట్టాకు అవకాశమిస్తే ఇలా వ్యవహరించారని చంద్రబాబు అన్నారు. అసలు ఆ పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా?అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం.
క్రమశిక్షణ ఉల్లఘించిన వారెవరైనా...
క్రమశిక్షణ ఉల్లంఘించిన వాళ్లు ఎంతటి వాళ్లైనా ఉపేక్షించేది లేదు: సీఎంక్రమశిక్షణ, విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవడం సరికాదని, ఎమ్మెల్యేలు.. కార్యకర్తలు, ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని, ప్రజల్లో ఉండే నాయకుడే సుదీర్ఘ రాజకీయాలు చేయగలరని చంద్రబాబు అన్నారు. మూడు నెలల్లో సుపరిపాలనతో పాజిటివ్ పర్సెప్షన్ మరింత పెరగాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏ ఎమ్మెల్యేల పనితీరుపై స్పష్టమైన డేటాతో నివేదికలు ఇచ్చిన సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి నిధుల విడుదలకు సీఎం ఆదేశించారు. మైక్రో లెవల్లో వివిధ అంశాలపై తన అభిప్రాయాలు సీఎం చంద్రబాబు చెప్పారు.
Next Story

