Fri Mar 20 2026 01:37:08 GMT+0530 (India Standard Time)
శనివారం పదో తరగతి పరీక్షను వాయిదా వేయాలి
శనివారం పదో తరగతి పరీక్షను వాయిదా వేయాలని సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా కోరారు

ముస్లింలకు అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన పండగ రంజాన్ ఈ సంవత్సరం మార్చి 21 శనివారం జరుపుకోనున్నారు. కానీ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం 20వ తారీఖున సెలవు ప్రకటించింది. పండగ రోజు పరీక్ష నిర్వహిస్తే ముస్లింలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. చంద్రమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం చంద్ర దర్శనం అవుతుంది.
రంజాన్ పండగ కావడంతో...
శనివారం రంజాన్ పండగ జరుపుకుంటామని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కి ముస్లింల తరఫున సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా శనివారం సెలవుగా ప్రకటించి, పదవ తరగతి పరీక్షను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో చూడాలి.
Next Story

