Fri Mar 20 2026 03:31:01 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నిరుద్యోగులకు ఉగాది నాడు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉగాది నాడు గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉగాది నాడు గుడ్ న్యూస్ చెప్పింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.ఇకపై ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్ విడుదల చేశారు. 91 గ్రూపు-1పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. హోం శాఖలో 2,778 పోస్టులకు ఆగస్టు 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది.
నోటిఫికేషన్లు ఇలా...
ఇతర శాఖల్లో 928 పోస్టులకు ఆగస్టు 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటనకూడా విడుదలయింది. 750 గ్రూపు-2 పోస్టులకు సెప్టెంబరు 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 503 ఏఈఈ పోస్టులకు సెప్టెంబరు 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇతరత్రా 506 పోస్టులకు సెప్టెంబరు 15వతేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పాఠశాల, ఇంటర్ విద్యకు చెందిన 3,004 పోస్టులకు అక్టోబరు 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది.
Next Story

