Tue May 06 2025 09:00:34 GMT+0530 (India Standard Time)
Andhra Pradsh : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెల జీతం ఎంతో తెలిస్తే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే ప్రభుత్వ P4 కార్యక్రమ సమన్వయానికి.. కాంట్రాక్ట్ పద్ధతిలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుకు అర్హతలను కూడా నిర్ణయించింది. అ ఎంబిఎ/పిజి డిగ్రీ - గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పూర్తి చేసి ఉండాలి. కనీసం సంబంధిత విభాగంలో 4 సంవత్సరాలు అనుభవం ఉండాలి. నెల జీతం అరవై వేల రూపాయలు ఇవ్వనున్నారు.
ఈ నెల 13 సాయంత్రంలోగా...
అర్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికను చేయనున్నారు. అర్హులైన వారంతా ఈ నెల 13వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్లో వెబ్ సైట్ ద్వారా https://apsdpscareers.com/YP.aspx వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కాంట్రాక్టు పద్ధతి అయినప్పటికీ నెలకు అరవై వేలు జీతం కావడంతో అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
Next Story