Tue May 06 2025 07:02:40 GMT+0530 (India Standard Time)
Chandrababu : ఈ నెల 7న గుంటూరుకు చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా గుంటూరు నగరంలోని శంకర్ విలా స్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన శంకుసఫాన చేయనున్నారు.
శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి...
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఓవర్ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని తలపెట్టారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంలోని ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి ఈ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 98 కోట్ల రూపాయలను మంజూరు చేయించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఈ నెల 7న శంకుస్థాపన చంద్రబాబు చేయనున్నారు. శంకుస్థాపన స్థలాన్ని నగరపాలక సంస్థ అధికారులు పరిశీలించారు. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story