Tue May 06 2025 07:44:22 GMT+0530 (India Standard Time)
Ys Sharmila : మోదీ సభపై వైఎస్ షర్మిల ఇలా అన్నారేంటి?
ప్రధాని నరేంద్ర మోదీ సభపై కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ సభపై కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. మోడీ తీరు చూస్తే చిచ్చుబుడ్డి తుస్సుమంది అనక తప్పదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని షర్మిల అన్నారు. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పన కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందేనని అన్నారు. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే.. ప్రధాని మోదీ మనకు ఇస్తున్నది ఏమిటి ? ఆనాడు 2015లో మట్టి కొట్టారు. నేడు సున్నం కొట్టి వెళ్ళారంటూ మండిపడ్డారు. పదేళ్ల ఏళ్ల క్రితం ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో..నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారన్నారు.
రూపాయి ఇవ్వకుండా...
మళ్ళీ "అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం" అంటూ బూటకపు మాటలు చెప్పారని, ఐదు కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుండి అన్ని చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారన్నవైఎస్ షర్మిల అన్ని ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదు ? అంటూ ప్రశ్నేించారు. అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్లలో ఒక్క రూపాయి అయినా ప్రకటించారా ? రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత అని హామీ ఇచ్చారా ? కనీసం అమరావతికి చట్టబద్ధత ఇస్తున్నామని చెప్పారా? పోనీ విభజన హామీలపై టైమ్ బాండ్ క్లారిటీ ఇచ్చారా ? - చంద్రబాబు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. పైసా విదిల్చకుండా వెళ్లిన మోదీని ఏమనాలంటూ ప్రశ్నించారు.
Next Story