Tue May 06 2025 08:47:54 GMT+0530 (India Standard Time)
Amaravathi : రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం
రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రభుత్వం వేగవంతం చేస్తుంది

రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభోత్సవం కార్యక్రమం పూర్తి కావడం తో పనులు వేగవంతం చేస్తున్న సర్కార్ ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు చర్చలు చేపట్టింది. డిజైన్లు రూపొందిస్తున్న సంస్థలతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చర్చలు జరిపారు.
డిజైన్లను ఖరారు చేసే...
సీఆర్డీయే కార్యాలయంలో నార్మన్ పోస్టర్,హఫీజ్ కాంట్రాక్టర్స్,ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశమయి ఐదు ఐకానిక్ టవర్లు,అసెంబ్లీ,హై కోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు నిర్వహించారు. ఆయా భవనాల డిజైన్లు ను మంత్రి,అధికారులకు ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు వివరించారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు, అధికారులు చర్యలు ప్రారంభించారు.
Next Story