Union Budget : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఏమిచ్చింది..? భవిష్యత్ లో ప్రయోజనమేనా?
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు కొంత భవిష్యత్ లో మేలు చేకూర్చేలా ఉంది

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు కొంత భవిష్యత్ లో మేలు చేకూర్చేలా ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 3,320 కోట్లను కేటాయించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 1,561 కోట్లను కేటయించారు. దీంతో పాటు సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఏర్పాటుతో ఎన్నో ప్రయోజనాలు ఉండనున్నాయి.దేశంలో కీలక ఖనిజాల రంగంలో భారత్ పాత్రను కొత్త దిశలో మలిచే కీలక చర్యను ఆర్థిక మంత్రి బడ్జెట్ లో ప్రకటించారు. రేర్ ఎర్త్ ఖనిజాల అభివృద్ధికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటులో ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని తెలిపారు.ఈ రేర్ ఎర్త్ కారిడార్లు గనుల తవ్వకం నుంచి శుద్ధి, పరిశోధన, ఆధునిక తయారీ వరకు మొత్తం విలువ గొలుసును కలిగి ఉంటాయని మంత్రి వివరించారు. రేర్ ఎర్త్ రంగంలో దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు.

