Fri Apr 03 2026 18:10:14 GMT+0530 (India Standard Time)
Ys Jagan : జగన్ కొత్త నినాదం ప్లస్ లేదా మైనస్?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త నినాదాన్ని కోస్తాంధ్ర ప్రజలు ఎంత వరకూ విశ్వసిస్తారన్నది ప్రశ్న

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త నినాదాన్ని కోస్తాంధ్ర ప్రజలు ఎంత వరకూ విశ్వసిస్తారన్నది ప్రశ్న. తాజాగా జగన్ ప్రతిపాదించిన మావిగాన్ పేరుతో కొత్త పేరును తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం - విజయవాడ - గుంటూరును కలుపుతూ రాజధాని నిర్మాణం సాగాలని, ఖర్చు లేకుండా రాజధానిని అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. అంటే భూ సమీకరణ చేయకుండానే రాజధాని నిర్మాణం చేయవచ్చన్నది జగన్ నూతన ప్రతిపాదన. ఈ ప్రతిపాదనతో కోస్తాంధ్రలో పార్టీకి కొంత ఊపు తేవాలన్న ఆలోచన జగన్ లో కనపడుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడున్నది కూడా...
ప్రస్తుతం విజయవాడ గుంటూరు మధ్యలోనే ఈ అమరావతి ప్రాంతం ఉంది. జగన్ కూడా 2019కి ముందు అసెంబ్లీ లో మద్దతిచ్చెప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న ఈ ప్రాంతానికి తన మద్దతు ప్రకటించారు. అమరావతి రాజదాని అంటే గుంటూరు విజయవాడ కూడా ఆ మేరకు ప్రయోజనం కలుగుతుంది , అవి కూడా రాజదాని లో భాగం కిందే లెక్క. చంద్రబాబు బాబు ప్లాన్ కూడా అదే. కానీ జగన్ కొత్త ప్రతిపాదనలో కొత్త దనం ఏముందన్నది అర్థం కాకుండా ఉంది. అమరావతిలో లక్షల కోట్లు ఖర్చు పెట్టకుండా ప్లాన్ బి తాము ఇచ్చినట్లు జగన్ చెప్పుకున్నారు.
కోస్తాంధ్రలో బలపడేందుకేనా?
రాయలసీమ, ఉత్తరాంధ్రలో వైసీపీ ఇటీవల కాలంలో కొంత బలం పుంజుకుంది. కూటమి ప్రభుత్వంలో లోపాలు కావచ్చు. ఎమ్మెల్యేలపై వ్యతిరేక కావచ్చు. జగన్ పార్టీపై కొంత సానుకూలత ఉందని జగన్ అంచనా వేసుకుంటున్నారు. కానీ కోస్తాంధ్ర ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పార్టీ ఇంకా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే జగన్ మావిగాన్ నినాదం అందుకున్నారన్న వాదన వినపడుతుంది. మరి మావిగాన్ జగన్ పార్టీని కోస్తాంధ్ర ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారన్నది కాలమే తేల్చనుంది. జగన్ కొత్త ప్రతిపాదనపై సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.
Next Story

