Fri Mar 20 2026 01:38:10 GMT+0530 (India Standard Time)
JC Prabhkar : జేసీ మాటల్లో ఆంతర్యం అదేనా? ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటారా?
రాజకీయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక రిటైర్ అయినట్లే అనుకోవాలి

రాజకీయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక రిటైర్ అయినట్లే అనుకోవాలి. ఆయన మాటలను చూస్తుంటే అదే అర్థమవుతుంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా పదవీ కాలం పూర్తి కావడంతో కొంత ఎమోషనల్ అయ్యారు. తన రాజకీయంగా పదవీ విరమణ చేసే సమయం వచ్చిందని ఆయన నిర్ణయం తీసుకున్నట్లే కనిపించింది. తన వయసు, ఆరోగ్యం కూడా ఇక సహకరించని ఆయన వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం లేదన్నది సన్నిహితులు చెబుతున్నారు. తాడిపత్రి మునిసిపాలిటీకి చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి 2021లో బాధ్యతలు స్వీకరించారు.
మున్సిపల్ ఛైర్మన్ గా...
జేసీ మున్సిపల్ ఛైర్మన్ పదవిలోకి వస్తారు అని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఆయన 2014లో తాడిపత్రి ఎమ్మెల్యేగా నెగ్గారు.ఎమ్మెల్యేగా పనిచేసిన వారు చైర్మన్ పదవిని ఎలా చేపడతారు అని అనుకోవచ్చు. కానీ జేసీ ప్రభాకర రెడ్డి రూటే సెపరేట్ కదా. అందుకే ఆయన తానే స్వయంగా పదవిలో ఉంటే తప్ప తాడిపత్రి పొలిటికల్ గా లైన్ లోకి రాదని వేసిన సూపర్ ప్లాన్ ఇది. దాంతో తన స్థాయిని తగ్గించుకుని మరీ చైర్మన్ అయ్యారు. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి గుండె కాయ లాంటి చైర్మన్ పదవిని జేసీ చేపట్టడం వల్లనే టీడీపీ అక్కడ మళ్ళీ పుంజుకుంది. అది 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాగా కనిపించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.
రెండు వేల కోట్ల ఆస్తి అంటూ...
తాడిపత్రి మునిసిపాలిటీ రెండు వేలకు పైగా కోట్ల ఆస్తులతో ఉంది అంటే దానికి కారణం తన పనితనం అని జేసీ చెప్పారు. వేరే ఎవరు ఉన్నా ఈ విధంగా చేసే వారు కాదని ఆయన అన్నారు. తాను తాడిపత్రిని అభివృద్ధి పధంలోకి తెచ్చాను అని చెప్పారు. ఆస్తులు తాను మునిసిపాలిటీకి కూడబెట్టాను అన్నారు. మునిసిపాలిటీ ఆస్తులను ఎవరూ ఏమీ చేయకుండా చట్టబద్ధంగా ఏమి చేయాలో అన్నీ చేశాను అన్నారు. జేసీ ఎమ్మెల్యే చేశారు, తిరిగి చైర్మన్ చేశారు, ఇపుడు ఆయన ఏమి చేయబోతున్నారు అని అంతా భావిస్తున్నారు. జేసీ ప్రభాకరరెడ్డిని రాజకీయంగా ఒక విలక్షణమైన నాయకుడు. ఆయన మాటలు, చేతలు కొంత ఇబ్బంది పెట్టినా ఏదీ దాచుకునే మనస్తత్వం కాదు. అలాగని ఆయన రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ కారని అనుకోలేం.
Next Story

