Mon Feb 02 2026 10:57:17 GMT+0530 (India Standard Time)
మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదు
మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసు కేసు నమోదయింది.

మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసు కేసు నమోదయింది. మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చని భావించిన జోగి రమేష్ అందుబాటులో లేకుండా పోయారు.
పోలీసుల విధులకు...
జోగి రమేష్ ఇటీవల నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నిన్న ఆయన ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. ఇంటిపై పెట్రోలు సీసాలు విసిరి నిప్పంటించారు. దీనిపై జోగి రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరొక కేసు ఆయనపై నమోదయినట్లు చెబుతున్నారు. తన న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. జోగి రమేష్ పోలీసుల విధులకు ఆటంకం కల్గించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
Next Story

