Tue May 06 2025 07:47:51 GMT+0530 (India Standard Time)
Narneda Modi : Narendra Modi : చంద్రబాబు ను ప్రశంసలతో ముంచెత్తిన మోదీ.. ఆయన నుంచే నేర్చుకున్నా
కొత్త అమరావతిని, కొత్త ఆంధ్రప్రదేశ్ ను మనం నిర్మించుకోబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు

కొత్త అమరావతిని, కొత్త ఆంధ్రప్రదేశ్ ను మనం నిర్మించుకోబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లు అనిపిస్తుందని అన్నారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని కనకదుర్గమ్మ కొలువైన ఈ పుణ్య ప్రాంతంలో ఉన్న అందరికీ నమస్కారాలు అని తెలియజేశారు. తనకు ఒక నగరం మాత్రమే కాదు.. ఒక కల సాకారం అవుతుందన్న నమ్మకం ఏర్పడిందని మోదీ అన్నారు. ఈరోజు శంకుస్థాపనలు చేసిన దానితో బలమైన పునాదులు వేయనున్నామని ప్రధాని మోదీ అన్నారు. అంతకు ముందు అమరావతి రాజధాని పనుల పునర్మిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. సర్ణాంధ్ర సాకారం అవడానికి అమరావతి కేవలం ఒక్క నగరం కాదని, ఒక శక్తి అని మోదీ అన్నారు.
తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో...
యువత కల సాకారం అవుతుందని, ఐటీ, ఆర్టిఫియల్ ఇంటిజెన్స్ వంటి రంగాల్లో రానున్న కాలంలో అమరావతి ప్రధాన నగరంగా రూపుదిద్దుకుంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేయడానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు హైదరాబాద్ ను ఐటీ ఏ రకంగా డెవలెప్ చేస్తున్నారో తెలుసుకుని తాను ముందుకు వెళ్లానని మోదీ అన్నారు. తన అనుభవంతో చెబుతున్నానని, పెద్ద స్కేల్ తో ప్రాజెక్టులు చేయాలన్నా, త్వరితగతిన పూర్తి చేయాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమని మోదీ ప్రశంసించారు.
మన ముగ్గురితోనే సాధ్యం...
2015లో తాను ప్రధానిగా అమరావతికి తాను శంకుస్థాపన చేశానని, చంద్రబా ముఖ్యమంత్రి కావడంతో మరింత అభివృద్ధి వేగంగా పరుగులు తీస్తుందని అన్నారు. ఎన్టీఆర్ కలను సాకారం చేయాలని, అది అమరావతి నిర్మాణంతోనే సాధ్యమవుతుందని మోదీ చెప్పారు. దీనిని మనమే చేయాలని మోదీ తెలుగులో అనడంతో కరతాళ ధ్వనులు మారుమోగిపోయాయి. విభజన ఆంధ్రప్రదేశ్ లో రైల్వే బడ్జెట్ ను తొమ్మిది వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని తెలిపారు. అనేక కేంద్ర ప్రాజెక్టులను మంజూరు చేసి ఏపీ అభివృద్ధి వేగంగా జరగడానికి సహకరిస్తానని మోదీ తెలిపారు. అమరావతిని వికసిత్ గ్రోత్ గా భారత్ గా మార్చాలని మోదీ ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణంతో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా నిర్మాణరంగంలో మరింత అభివృద్ధి జరుగుుతుందని మోదీ అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తాం...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్ర పరిస్థితి మారిపోతుందని తెలిపారు. నదుల అనుసంధానం ప్రాజెక్టులను ప్రారంభించామని, పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగిందని, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు సహకరిస్తామని తెలిపారు. సాగునీరుకు ఇబ్బంది లేకపోతే పంటలు సమృద్ధిగా పండుతాయని తెలిపారు. భారత్ బలం కేవలం ఆయుధాల్లో లేదని, మన ఐక్యతలోనే ఉందని మోదీ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని మోదీ ఆకాంక్షించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున జూన్ 21వ తేదీన ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా మనం యోగాను ప్రచారంచేయాలని ప్రపంచ రికార్డు సాధించాలని మోదీ కారు. విశాఖలో యోగాకార్యక్రమంలో తాను పాల్గొంటానని మోదీ తెలిపారు. ఏపీ ప్రస్తుతం సరైన మార్గంలో ప్రయాణం చేస్తుందన్న మోదీ మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయితే ఏపీ జీడీపీ పెరుగుతుందని చెప్పారు.
Next Story