Fri Mar 20 2026 01:37:12 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏప్రిల్ 1 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూనియర్ కళాశాలలను తిరిగి ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూనియర్ కళాశాలలను తిరిగి ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఇంటర్ రెండో ఏడాది విద్యార్థులకు ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహించి.. మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవనున్నట్లు ప్రకటించారు. 2026-27 విద్యా సంవత్సరం లో 232 పనిదినాలు ఉంటాయని ఇంటర్ విద్యా మండలి ప్రకటించింది.
ర్యాంకుల పేరుతో...
ర్యాంకుల పేరుతో ప్రైవేట్ కళాశాలలు తప్పుడు ప్రకటన చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది. జూనియర్ కళాశాలలు జూన్ 1వ తేదీనుంచి తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది. అప్పటికి టెన్త్ ఫలితాలు కూడా రావడంతో విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో చేరే అవకాశముంది.
Next Story

