Tue May 06 2025 08:38:45 GMT+0530 (India Standard Time)
Tirumala: శనివారం తిరుమలలో భక్తుల రద్దీ ఎంత ఉందో తెలుసా?
తిరుమలలో భక్తుల భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది

తిరుమలలో భక్తుల భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వేసవి రద్దీ తిరుమలలో మొదలయినట్లు కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా భక్తుల రాక తక్కువగా ఉన్నప్పటికీ రెండు రోజుల నుంచి రద్దీ ఎక్కువ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల ఎండ వేడికి ఇబ్బంది పడకుండా కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు కార్పెట్లు కూడా పరుస్తూ కాళ్లు మాడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమలలో క్యూ లైన్లలో, కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ ప్రసాదాలను పంపిణీ చేస్తూ వారు ఇబ్బంది పడకుండా చూస్తున్నారు.
ఫీడ్‌బ్యాక్ విధానంతో...
భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కొత్తగా ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్‌తో స్కాన్ చేస్తే వాట్సాప్‌లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం అంటే అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు వాటిని ఎంచుకోవాలి. - అనంతరం, అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ ను ఎంచుకోవచ్చు. లేదా సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు/మరింత మెరుగుదల అవసరం, లేదా బాగాలేదు గా రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చని టీటీడీ తెలిపింది.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూుడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,344 భక్తులు దర్శించుకున్నారు. వీరిలో s : 32,169 భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.50 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story