Sun Jul 27 2025 00:12:12 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎలా ఉందో తెలిస్తే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం అయినా భక్తుల రద్దీ అంతగా లేదు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం అయినా భక్తుల రద్దీ అంతగా లేదు. సహజంగా శని, ఆదివారాలు ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. కానీ వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నందున భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనే భక్తుల సంఖ్య తక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. శనివారం వెంకటేశ్వరస్వామికి ఇష్టమైన రోజు కావడంతో భక్తుల సంఖ్య ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది.
కొద్ది నెలలుగా...
తిరుమలలో భక్తుల రద్దీ గత కొద్ది నెలలుగా కొనసాగుతుంది. రోజుకు ఎనభై వేల మంది భక్తులకు పైగానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. హుండీ ఆదాయం కూడా రోజుకు నాలుగు కోట్ల రూపాయలు మేరకు వచ్చిందని, ఒకరోజు తగ్గినప్పటికీ మరొక రోజు అధికంగా రావడంతో యావరేజ్ ప్రకారం చేస్తే రోజుకు నాలుగు కోట్ల ఆదాయం వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు.
పన్నెండు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పన్నెండు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం మాత్రమే పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,576 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,227 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story