Tue Jul 22 2025 03:22:28 GMT+0530 (India Standard Time)
సాంకేతిక కమిటీపై తెలుగురాష్ట్రాలకు కేంద్ర జలశక్తిశాఖ లేఖ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకి కేంద్ర జలశక్తిశాఖ లేఖ రాసింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకి కేంద్ర జలశక్తిశాఖ లేఖ రాసింది. బనకచర్ల సాంకేతిక కమిటీకి ముగ్గురు పేర్లు పంపాలని లేఖలో పేర్కొంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశమైన సంగతి తెలిసిందే. కృష్ణా, గోదావరి నదీజలాల వాటాలు, పంపకాలపై కమిటీ వేసి వాటిపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.
సభ్యుల పేర్లను పంపాలని...
మొత్తం పన్నెండు మందితో కేంద్ర జలసంఘం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని ఆరోజు నిర్ణయించింది. సమావేశంలో నిర్ణయించిన ప్రకారం కమిటీ ఏర్పాటుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రెండు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు నిపుణులతో పాటు కేంద్రానికి చెందిన ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
Next Story