Fri Apr 03 2026 18:15:20 GMT+0530 (India Standard Time)
Gold Price Today : గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు ఎంతంటే?
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

మధ్య ప్రాచ్యంలో యుద్ధం కొనసాగినంత కాలం బంగారం ధరలు తగ్గుతాయన్న అంచనాలు నిజమవుతున్నట్లే కనిపిస్తుంది. యుద్ధం మొదలయి ఇప్పటికే దాదాపు 33 రోజులవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరలు చాలా వరకూ తగ్గాయి. కొన్ని సార్లు భారీ సంఖ్యలో తగ్గాయి. మరికొన్ని సార్లు స్వల్పంగా తగ్గాయి. పసిడి మురిపిస్తుంది. రా.. రామ్మంటూ ఆహ్వానిస్తుంది. దీంతో వినియోగదారులు మళ్లీ ధరలు పెరుగుతాయేమోనని భావించి అవసరమైన వారు బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమయ్యారు. దీంతో జ్యుయలరీ దుకాణాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి.
యుద్ధం ప్రభావంతో...
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం మొదలయిన తర్వాత బంగారం ధరలు హద్దులు లేకుండా పెరుగుతుందని అందరూ భావించారు. కానీ అమెరికా డాలర్ బలహీనపడటం, క్రూడాయిల్ ధరలు పెరుగుుతుండటంతో బంగారం ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు ఎంత తగ్గినా ఇంకా అందుబాటులోకి రాలేదని కొందరు ఇంకా ధరలు తగ్గుతాయేమోనని వేచి చూస్తున్నారు. యుద్ధం ఇంకా కొనసాగితే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. అలాగే వెండి ధరలు కూడా తగ్గుతాయంటున్నారు.
పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో...
ఇక పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో హ్యాపీగా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. శుభకార్యాలు, పెళ్లిళ్లకు బంగారాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. అందుకే అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,36,540 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,960 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,49,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

