Sat Dec 13 2025 08:45:49 GMT+0530 (India Standard Time)
Gold Price Today : రేపు అక్షర తృతీయ.. గోల్డ్ లవర్స్ కు ఇంతటి గుడ్ న్యూస్.. ఇంతలా ధరలు తగ్గాయా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

బంగారం ధరలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఏ రేంజ్ లో అంటే లక్షకు చేరుకున్న పది గ్రాముల బంగారం ధర తిరిగి క్రమంగా దిగి వస్తుంది. ధరలు పెరిగి కొనుగోళ్లు తగ్గిపోవడంతో ధరలు కూడా క్రమంగా దిగిరాక తప్పడం లేదు. ఎందుకంటే బంగారం కొనుగోలు చేయాలంటే కేవలం ధనిక వర్గాలనే నమ్ముకుంటే వీలు కాదు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎంత ఎక్కువగా కొనుగోలు చేస్తే అంత ఎక్కువగా బంగారు ఆభరణాలు అమ్ముడు పోతాయి. అందుకే ధరలు పెరగడంతో అమ్మకాలు మరింత తగ్గిపోయాయి. మరొకవైపు వెండి ధరలు కూడా విపరీతంగా పెరుగుతుండటంతో దానిని కొనుగోలు చేసే వారు సయితం పెద్దగా కనిపించడం లేదు.
రేపు అమ్మకాలు పెరుగుతాయని...
రేపు అక్షర తృతీయ. అక్షర తృతీయకు బంగారాన్ని కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. అక్షర తృతీయ రోజున బంగారాన్ని గ్రాము అయినా కొనుగోలు చేసి దానిని లక్ష్మీదేవి వద్ద పెట్టి పూజలు చేస్తే సంపద మరింత పెరుగుతుందన్న నమ్మకం ఎక్కువ దక్షిణ భారతీయుల్లో ఉంది. అందుకే అక్షర తృతీయ నాడు అమ్మకాలు మరింత ఊపందుకుంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ధరలు చూసి ఆగినా అక్షర తృతీయ రోజు ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయడం గ్యారంటీ అని భావించి అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తమ వద్ద బంగారు ఆభరణాలు కొంటే గ్రాముపై వెయ్యి రూపాయలు తగ్గిస్తామని కొన్ని దుకాణాలు ముందుకు వచ్చి ప్రకటనలు చేస్తున్నాయంటే అమ్మకాలపై ఏ మేరకు ప్రభావం పడిందో చెప్పాల్సిన పనిలేదు.
ధరలు తగ్గి...
బంగారం ధరలు ఇలా పెరిగి పోవడానికి అనేక కారణాలున్నాయి. అయినా సరే దిగుమతులు తగ్గకపోవడంతో పాటు డిమాండ్ కూడా తగినంత లేకపోయినా బంగారం, వెండి ధరలను అదుపు చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం, వెండి ధరలు అక్షర తృతీయకు ఒకరోజు ముందు దిగివస్తున్నాయి. ఇది కొనుగోలు దారులకు తీపి కబురు లాంటిదే. నిన్న తులం బంగారంపై 680 రూపాయలు తగ్గింది. వెండి ధరలు కూడా స్వల్పంగానే తగ్గాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,800 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,430 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 99,040 రూపాయలుగా కొనసాగుతుంది.
Next Story

