Tue May 06 2025 09:14:44 GMT+0530 (India Standard Time)
Gold Price Today :తగ్గకుంటే ఎవరు కొంటారు.. కొనాలంటే తగ్గాల్సిందే మరి.. పసిడిప్రియులకు గుడ్ న్యూస్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది.

బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో జ్యుయలరీ దుకాణాలకు వచ్చేందుకు కూడా వినియోగదారులు భయపడిపోతున్నారు. ఒకరకంగా ధరలను చూసి బంగారం అంటే మొహం మొత్తింది. బంగారం కొనుగోలు చేయలేకపోతే వన్ గ్రామ్ గోల్డ్ లేదా.. రోల్డ్ గోల్డ్ లేదా.. గిల్ట్ నగలతో పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లవచ్చన్న భావన అందరిలోనూ ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతున్నాయి. బంగారమయితే లక్షను అలా టచ్ చేసి వచ్చేసింది. వెండి ధరలు కిలో ఎప్పుడో లక్ష రూపాయలు దాటేశాయి. దీంతో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. ఎంత అవసరమున్నా బంగారం వైపు చూడటం మానుకున్నారు.
అక్షర తృతీయకు కూడా...
నిన్న అక్షర తృతీయకు కూడా ఎక్కువ మంది అమ్మవారి దేవస్థానాలకు వెళ్లి మొక్కుకున్నారు తప్పించి గ్రాము బంగారం కొనుగోలు చేయడానికి కూడా పెద్దగా ఎవరూ ముందుకు రాకపోవడంతో పరిస్థితికి అద్దం పడుతుంది. అప్పటికీ జ్యుయలరీ దుకాణాలు అనేక ఆఫర్లు ప్రకటించినా గ్రాముకు వెయ్యి రూపాయలు తగ్గిస్తామన్నా, ఎంత బంగారం కొంటే అంత వెండి ఇస్తామన్న ప్రకటనలు కూడా వెలవెలబోయినట్లే కనిపించింది. ధరలు ఈ రేంజ్ లో ఉంటే కొనుగోలు చేయడానికి ముందు శక్తి సరిపోవాలి కదా? అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. అందుకే బంగారం లేకపోయినా బతకొచ్చు కానీ ఇంత ధరలు పోసి కొనుగోలు చేయలేమన్న నిర్ణయానికి వచ్చారు.
కొంచెం తగ్గినా...
అయితే బంగారాన్ని కొనుగోలు చేయడానికి కొన్ని వర్గాలు మాత్రం రెడీగా ఉంటాయి. సంపన్న వర్గాలు ఎంత ధర పెట్టయినా కొనుగోలు చేస్తాయి. అయితే వారు కొనుగోలు చేసేది కొన్ని ఎంపిక చేసిన దుకాణాల్లోనే. సామాన్యులు కొనుగోలు చేసే దుకాణాలకు మాత్రం ధరల పెరుగుదల ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. అయితే ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది. హైదరాబద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,740 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,900 రూపాయల వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,08,900 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
Next Story