Tue Jul 22 2025 13:33:12 GMT+0530 (India Standard Time)
Gold Price Today : లక్షకు దగ్గరయిన పసిడి...శ్రావణ మాసంలో ఇంకెంత పెరుగుతుందో?
నేడు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి

బంగారం ధరలకు రెక్కలు ఉన్నట్లుంది. ఎప్పుడూ పైకి ఎగరడమే తప్ప దిగువ చూపులు చూస్తున్నట్లు కనిపించడం లేదు. బంగారం అనేది ఒకనాడు స్టేటస్ సింబల్ గా మారింది. అందుకే అత్యధికంగా అప్పులు చేసైనా కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడానికి అప్పులు కూడా సరిపోయేటట్లు లేవు. సొంత ఇంటిని తనఖా పెట్టాల్సి వస్తుందేమోనన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. బంగారం ధరలు అంత స్థాయిలో పెరగడం గతంలో ఎన్నడూ చూడలేదని మార్కెట్ అనలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మరోసారి బంగారం ధరలు లక్షకు చేరువకు చేరుకున్నాయి. గతంలో రెండు దఫాలు పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు దాటేసినా మళ్లీ దిగివచ్చి నేడు మళ్లీ లక్షకు చేరువయింది.
సంపన్నులకే సొంతం...
బంగారం అంటే అందరికీ మక్కువ. బంగారం అనేది ఇప్పుడు ప్లాటినం కంటే ఖరీదైన వస్తువుగా మారింది. ఒకప్పుడు ప్లాటినం ఆభరణాలను ఉపయోగించేవారు. బంగారం ఆభరణాలను తగ్గించి సంపన్నులు ప్లాటినం కొనుగోలు చేసి తమ స్థోమతను పది మందిలో చూపించుకునే వారు. కానీ ఇప్పుడు ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అంత సంపన్నుల కింద లెక్క. అదీ కాకుండా ఇప్పుడు బంగారాన్ని అందరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ కూడా సమీపిస్తుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఆషాఢమాసంలోనే ఈ రేంజ్ లో ధరలు పెరిగితే ఇక శ్రావణ మాసం ఎంటర్ అయిందంటే గోల్డ్ అందరికీ చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తుంది.
మళ్లీ పెరిగి...
ఈ నెల 25వ తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. నవంబరు చివర వరకూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. అంటే నాలుగు నెలల పాటు వరస పెళ్లిళ్లు జరుగుతుండటంతో బంగారానికి మంచి డిమాండ్ ఏర్పడనుంది. అయితే నేడు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల రూపాయల వరకూ పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,560 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99, 890 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,24,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story