Tue Jul 22 2025 13:09:04 GMT+0530 (India Standard Time)
Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి

బంగారం ధరలు భగభగముంటున్నాయి. ధరలు అదుపులోకి రావడం లేదు. ఈ ఏడాదికి ఏమయిందో తెలియదు కానీ.. ధరలు ఇంతగా పెరగడం గతంలో ఎన్నడూ లేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడం అంటే.. పదో పరకో పెరుగుతూ గతంలో పెద్దగా ఆర్థికంగా సమస్యలు లేకుండా చేశాయి. అందుకే కొన్నేళ్ల నుంచి ధరలు పెరుగుతున్నా కొనుగోళ్లపై మాత్రం ప్రభావం పడటం లేదు. కానీ ఈ ఏడాది అలా కాదు. భారీగా ధరలు పెరిగాయి. ఎవరూ కొనలేని స్థాయిలో ధరలు పెరగడం ఆందోళనకు గురి చేస్తుంది. అందుకేఈ ఏడాది మొదటి నుంచి ప్రారంభమైన బంగారం ధరల పెరుగుదల ఇప్పటి వరకూ ఆగలేదు. ఇక ఆగుతుందన్న నమ్మకం కూడా లేదు.
లక్షకు చేరువలో...
బంగారం ధరలు లక్ష రూపాయలకు మళ్లీ చేరువవుతున్నాయి. గతంలో రెండుసార్లు లక్ష రూపాయలకు పైగానే టచ్ చేసిన బంగారం ధరలు మళ్లీ కొంత తగ్గి ఊరిస్తున్నట్లు అనిపించినప్పటికీ మళ్లీ పెరుగుదల చూస్తే ఈ ఏడాదిలో ముచ్చటగా మూడోసారి లక్ష రూపాయలకు చేరుకుంటుందన్న అభిప్రాయం మార్కెట్ వర్గాలలో వ్యక్తమవుతుంది. లక్ష రూపాయలకు చేరుకుంటే ఖచ్చితంగా అది కొనుగోళ్లపై ప్రభావం పడుతుంది. అంతర్జాతీయంగా మార్కెట్ లో నెలకొన్న ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలున్నాయి. ఈ ఏడాది కొన్ని దేశాల మధ్య నెలకొన్న యుద్ధాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు ఊతమిచ్చాయి.
వెండి తగ్గి...
బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్యులకు సాధ్యం అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. వెండి ధరలు కూడా బంగారం ధరలతో పోటీ పడి పరుగులు పెడుతున్నాయి. అందుకే ధరలు పెరిగి కొనుగోలుపై ప్రభావం చూపుతున్నప్పటికీ పెద్దగా తగ్గడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరలపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరలు పెరిగవచ్చు. తగ్గవచ్చు. లేక స్థిరంగా కొనసాగవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,110 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం దర 99,390 రూపాయలుగా నమోదయింద.ి కిలో వెండి ధర 1, 23, 800 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story