Tue Jul 22 2025 13:22:40 GMT+0530 (India Standard Time)
Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

బంగారం ధరలు మరింతగా పెరుగుతాయన్న అంచనాలు వినపడుతూనే ఉంటాయి. దీనికి తోడు శ్రావణ మాసం సమీస్తుండటంతో ధరలు ఇక ఆగవన్నది అందరికీ తెలిసిందే. శ్రావణ మాసంలో మహిళలు లక్ష్మీదేవిని పూజించుకోవడం కోసం బంగారం కొనుగోలు చేసి అమ్మవారి ఎదుట ఉంచి పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే శ్రావణ శుక్రవారం పూజల కోసం మహిళలు ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేసే ఛాన్సు ఉంది. ఇక నాలుగు నెలల పాటు ఈ నెల 25వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం కానుండటంతో పెళ్లిళ్లు కూడా జోరుగా జరుగుతున్నాయి. అందుకే బంగారం, వెండి ఆభరణాలకు, వస్తువులకు డిమాండ్ భారీగా పెరుగుతుంది.
అవసరానికి ఉపయోగపడుతుందని...
ప్రస్తుతం ఆషాఢమాసం నడుస్తున్నప్పటికీ బంగారం, వెండి ధరలు పెరుగుదల మాత్రం ఆగడం లేదు. ఇక కేవలం అలంకారంగానే బంగారాన్ని చూసే రోజులు పోయాయి. భవిష్యత్ కు భరోసాగా భావించే రోజులు వచ్చాయి. కష్టకాలంలో బంగారం తమను ఆదుకునేందుకు అవకాశం ఉంటుందని అందరూ అంచనా వేసుకుని మరీ కొనుగోలు చేస్తారు. కొనుగోలు శక్తి పెరిగిన వాళ్లు ఈ సమయంలోనూ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. బంగారం అయితే గ్యారంటీగా తమ పెట్టుబడికి తగిన లాభం వస్తుందని నమ్ముతారు. అది అమ్మకపోయినా.. అవసరానికి ఉపయోగపడుతుందన్న నమ్మకం బంగారం బలంగా కలిగిస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి.
వెండి తగ్గి...
బంగారు, వెండి వస్తువులకు ఎక్కువగా భారత్ లో డిమాండ్ ఉంటుంది. భారత్ లోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ బంగారం, వెండి క్రయివిక్రయాలు జరుగుతుంటాయి. అందుకే జ్యుయలరీ దుకాణాలు సౌత్ ఇండియాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 91,060 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,340 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,23,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story