Wed Dec 10 2025 09:39:26 GMT+0530 (India Standard Time)
Gold Price Today : బంగారం కొనుగోలు చేసి నష్టపోయిన వారు చరిత్రలో లేరట
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి

బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయి. కొనుగోలు చేసే వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఆరంభంలోనే పది గ్రాముల బంగారం ధర లక్షన్నర రూపాయలకు చేరుకుంటుందని చెబుతున్నారు. అలాగే కిలో వెండి ధర కూడా రెండు లక్షల రూపాయలు దాటిపోతుందని అంటున్నారు. వచ్చే ఏడాది మరింత ధరలు పెరగనుందన ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్ కూడా ముగియడంతో పాటు మూఢమి వచ్చేయడంతో ఇక బంగారం అమ్మకాలు మరింత పడిపోతాయేమోనన్న ఆందోళన వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతుంది.
భారత్ లోనే మార్కెట్ ఎక్కువ...
భారత్ లో బంగారం, వెండిపై మక్కువ చూపే వారు అధికం. కేవలం మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా దీనిని పెట్టుబడిగా చూడటం ప్రారంభమయిన తర్వాత బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అమాంతం పెరగడానికి గత కొద్ది నెలలుగా భారతదేశంలో జరుగుతున్న శుభకార్యాలు, పెళ్లిళ్ల కారణంగానే అని చెబుతున్నారు. మరొకవైపు అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ విధించిన అదనపు సుంకాలు వంటివి కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపాయని అంటున్నారు. అలాగని రానున్న కాలంలో ధరలు తగ్గుతాయని భావించవద్దని కూడా చెబుతున్నారు.
భారీగా పెరిగి...
గత కొన్ని దశాబ్దాలుగా బంగారం, వెండి ధరల మార్పులను పరిశీలిస్తే పెరుగుదలే తప్ప తగ్గుదల అన్నది చాలా తక్కువసార్లు ఉంటుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి ధీటుగా వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. అలాగే బంగారం, వెండి కొనుగోలు చేసి నష్టపోయిన వారు చరిత్రలో లేరు. ఇక ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండి ధరపై దాదాపు 9వేల రూపాయల వరకూ పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,29,820 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,92,000 రూపాయలకు ఎగబాకింది.
Next Story

