Wed Dec 10 2025 09:39:29 GMT+0530 (India Standard Time)
Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గట్టిగానే షాక్.. ఇక కొనడం కష్టమే
. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగింది

బంగారం ధరలు పెరుగుతాయి. అది అందరికీ తెలుసు. గత కొన్ని రోజులుగా ధరలకు అదుపు పడటం లేదు. వెండి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ధరలు ఇలా పెరిగిపోతుండటంతో వాటి ప్రభావం కొనుగోలుపై పడుతుంది. పైగా ఇప్పుడు మూఢమి నడుస్తుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు మరో రెండున్నర కాలం పాటు ఉండవు. అందుకే బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం కూడా తక్కువగానే ఉంటుంది. ఈ రెండు నెలల పాటు ధరలు పెరిగితే అస్సలు బోణీ కూడా కావని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం కలవరపడుతుంది. ఇప్పటికే ధరలు అందుబాటులోకి లేకుండా పోతున్నాయి. అయినా సరే బంగారం మాత్రం తన పెరుగుదలను నిలువరించలేకపోతుంది.
జ్యుయలరీ దుకాణాలు...
బంగారం ధరలు బాగా పెరగడంతో తగ్గినప్పుడు కొనుగోలు చేద్దాములే అన్న ఆలోచనలో చాలా మంది పడిపోయారు. జ్యుయలరీ దుకాణాలు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నప్పటికీ వాటికి మాత్రం తలొగ్గడం లేదు. ఆఫర్లను చూసి జ్యుయలరీ దుకాణాలకు పరుగులు పెట్టే రోజులు పోయాయి. ఎంతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో కార్పొరేట్ జ్యుయలరీ దుకాణాలు తమ షాపుల నిర్వహణకు అయ్యే ఖర్చులు కూడా నెలకు రావడం లేదని వాపోతున్నారు. కొన్ని శాఖలను మూసివేయాలని నిర్ణయించుకుంటున్నాయి. ప్రధాన ప్రాంతాల్లోనే జ్యుయలరీ దుకాణాలను తెరిచి ఉంచాలని నిర్ణయించాయి. డిమాండ్ తగ్గడం వల్లనే ఈ రకమైన పరిస్థితి నెలకొందని అంటున్నారు.
భారీగా పెరిగి...
బంగారం, వెండి ధరల్లో కొద్దిగా హెచ్చు తగ్గుదల ఉంటే పరవాలేదు. కానీ పది గ్రాముల బంగారం ధర లక్షన్నరకు చేరువలో ఉంది. కిలో వెండి ధర రెండు లక్షలకు దగ్గరగా వెళ్లింది. దీంతో వీటిని కొనుగోలు చేయడానికి భయపడిపోతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర పై 680 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై 3,200 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,610 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,490 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 1,96,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మరిన్ని మార్పులు చేరుకోవచ్చు.
Next Story

