Tue Jul 22 2025 13:01:36 GMT+0530 (India Standard Time)
ఉద్యోగులకు షాకిచ్చిన ఇంటెల్
ఇంటెల్ సంస్థ యాజమాన్యం ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది

ఇంటెల్ సంస్థ యాజమాన్యం ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల పలు సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ సంస్థలు సిబ్బంది సంఖ్యను కుదించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఉద్యోగులకు లే ఆఫ్ లు ప్రకటిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థ కూడా లే ఆఫ్ లు ప్రకటించిందంటే సాఫ్ట్ వేర్ రంగంలో నెలకొన్న మాంద్యమే కారణమని అంటున్నారు.
ఐదు వేల మందికి ఉద్వాసన...
తాజాగా ఇంటెల్ సంస్థ యాజమాన్యం కూడా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. చిప్ తయారీ సంస్థ ఇంటెల్ లేఆఫ్స్ ను ప్రకటించింది. ఇంటెల్ సంస్థలో పనిచేస్తున్న ఐదు వేల మంది ఉద్యోగులు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఖర్చు, నిర్వహణ వ్యయం తగ్గింపు చర్యల్లో భాగంగానే లేఆఫ్స్ ప్రకటించినట్లు ఇంటెల్ సంస్థ తెలిపింది.
Next Story