Tue May 06 2025 07:50:54 GMT+0530 (India Standard Time)
Hyderabad : హైదరాబాద్ కు ట్రంప్ టవర్ వచ్చేస్తుందోచ్.. ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు ఎంతో తెలుసా?
హైదరాబాద్ లో ట్రంప్ టవర్ రానునట్లు తెలిసింది. అత్యంత ఎత్తైన ఈ టవర్ల నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కానుంది.

హైదరాబాద్ లో ట్రంప్ టవర్ రానునట్లు తెలిసింది. అత్యంత ఎత్తైన ఈ టవర్ల నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కానుంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం ఏమాత్రం తగ్గలేదనడానికి ఇది ఉదాహరణ మాత్రమే. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందనే వారికి ఈ వార్త చూసిన తర్వాత మతి బోతుంది. ఎందుకంటే మన హైదరాబాద్ లో ట్రంప్ టవర్ ఏర్పాటు కానుంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని భావించే వారు ఇక కళ్లు, చెవులు మూసుకోవచ్చంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో ఎన్నడూ రియల్ రంగానికి ఢోకా ఉండదన్నది మరోసారి రుజువయింది.
కోకాపేట్ భూములంటేనే...
హైదరాబాద్ లోని కోకాపేట్ భూములంటే అత్యంత విలువైనవి. కోకాపేట్ లో ఎకరం కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక్కడ భూమి బంగారం. ఇప్పటికే కోకాపేట్ లో ఆకాశహార్మ్యాలు నిర్మించారు. వీటికి తోడుగా ట్రంప్ టవర్ కూడా ఏర్పాటయితే ఇక హైదరాబాద్ ను ఆపేదెవరు? అన్న ప్రశ్నకు సమాధానం కూడా దొరకదు. కోకాపేట్ లో అన్ని వసతులలో ఫ్లాట్ తీసుకోవాలంటే ఇప్పటికే కోట్ల రూపాయలు అవుతుంది. ఎందుకంటే అన్నింటికీ దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలో ఫ్లాట్ లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కోకాపేట్ లో భూమి దొరికితే వదిలి పెట్టరు.
ఇండియాలో ఇప్పటి వరకూ నాలుగు చోట్ల మాత్రమే...
ట్రంప్ టవర్లు ఇండియాలో ఇప్పటి వరకూ నాలుగు చోట్ల మాత్రమే ఉన్నాయి. కోల్ కత్తా, ముంబయి, గుర్ గావ్, పూనేలలో మాత్రమే ఉన్నాయి. ఐదో ట్రంప్ టవర్స్ హైదరాబాద్ లో నిర్మించనున్నారు. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టంబరు నెలలో ట్రంప్ టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కోకాపేట్ లోని నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ట్రంప్ టవర్స్ ను నిర్మించనున్నారు. వీటిని ట్రిబెకా డెవలెపర్స్ నిర్మిస్తున్నట్లు ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
లగ్జరీ ఫ్లాట్ల నిర్మాణంతో...
హైదరాబాద్ లోని కోకాపేట్ లో నిర్మిస్తున్న ఈ ట్రంప్ టవర్స్ అంచనా వ్యయం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అని చెబుతున్నారు. మొత్తం నాలుగు వందల వరకూ లగ్జరీ ఫ్లాట్లను నిర్మించనున్నారు. ఒక్కొక్క ఫ్లాట్ ధర ఐదు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ప్రాధమిక అంచనాగా తెలుస్తుంది. మొత్తం నాలుగు టవర్లను నిర్మించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న ఈ ట్రంప్ టవర్స్ హైదరాబాద్ లోనే అత్యంత ఎత్తైనవిగా ఉంటాయని చెబుతున్నారు. మొత్తం మీద ట్రంప్ టవర్స్ రాకతో హైదరాబాద్ రియల్ రంగం ఎక్కడికో పోతుందనిపిస్తుళ్లా...!
Next Story