Tue May 06 2025 07:49:22 GMT+0530 (India Standard Time)
Goa : గోవాలో ప్రమాదం.. తొక్కిసలాటల ఆరుగురు మృతి
గోవాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు.

గోవాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు. గోవాలోని శిర్గావ్ ఆలయంలో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనలో ముప్ఫయి మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయని చెబుతున్నారు. గాయపడిన వారిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది మే 2వ తేదీన శ్రీదేవి జాతర జరుగుతుంది.
జాతర సందర్భంగా...
అయితే ఈ జాతర సందర్భంగా తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారని చెబుతున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు దాదాపు లక్ష మంది భక్తులు రావడంతో పాటు ఒక్కసారిగా ముందుకు దూసుకు పోవడంతో ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో మరణించారు. ముప్ఫయి మందికి ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. జాతర జరిగే మార్గం ఎత్తైన ప్రదేశంలో ఉండటం తొక్కిసలాటకు కారణంగా చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story