Tue May 06 2025 08:43:48 GMT+0530 (India Standard Time)
Accident : అదుపుతప్పిన కారు.. ఐదుగురు మెడికల్ స్టూడెంట్స్ తో సహా మరొకరు మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెంవద్ద ఒక ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో ఆరుగురు మరణించారు

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెంవద్ద ఒక ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో ఆరుగురు మరణించారు. కారు అదుపు తప్పి వేగంగా ఇంట్లోకి దూసుకు రావడంతో ఈ ఘటన జరిగింది. ముంబయి జాతీయ రహదారిపై ఉన్న పెట్రోలు బంకు వద్దకు రాగానే అదుపుతప్పిన కారు ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇంట్లో ఉన్న రమణమయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వైద్య విద్యార్థులు. నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో చదువుతున్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని స్నేహితుడి సోదరి నిశ్చితార్థానికి వెళ్ల తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అతివేగమే కారణమా?
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స మరణించారు. కారులో ఉన్న ఐదుగురు విద్యార్థులు మరణించారు. కారులో ఉన్న వైద్య విద్యార్థులు జీవన్, విష్నేశ్, నరేశ్, అభిసాయి, అభిషేక్ లు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో విద్యార్థి వినీత్ రెడ్డి గాయాలతో బయటపడ్డారు. వీరంతా మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నారని చెబుతున్నారు. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. కారులో ఉన్న విద్యార్థులు మద్యం సేవించి ఉన్నారా? లేదా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Next Story