Sun Jul 27 2025 00:07:56 GMT+0530 (India Standard Time)
Cyber Crime : అచ్చంపేట .. అనిరుధ్ మామూలోడు కాదు.. ఐదు కోట్లకు టోకరా వేశాడుగా?
తెలంగాణకు చెందిన అనిరుధ్ అనే యువకుడు దేశంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు

తెలంగాణకు చెందిన అనిరుధ్ అనే యువకుడు దేశంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. అతని కోసం అనేక రాష్ట్రాలకు చెందిన పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట పట్టణానికి చెందిన అనిరుధ్ దేశంలోని అన్ని ప్రాంతాలకు తిరుగుతూ ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల్లో తిరుగుతూ అమయాకులైన వారి నుంచి డబ్బులు దండుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
అనేక రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ కు పాల్పడి...
దాదాపు ఐదు కోట్ల రూపాయల మేరకు సైబర్ క్రైమ్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పూణె, కర్ణాటక, తమిళనాడుల్లోనూ అనిరుధ్ పై అనేక కేసులు నమోదయ్యాయి. అన్ లైన్ లో లింకులు పంపించడం, వారిని మభ్య పెట్టి డబ్బులు గుంజడం వంటివి అనిరుధ్ చేస్తాడు. డబ్బులు తన అకౌంట్ లోపడిన వెంటనే అక్కడి నుంచి బిచాణా ఎత్తేస్తాడు. అనేక రాష్ట్రాల పోలీసులకు అనిరుధ్ సవాల్ గా మారాడు. అనేక చోట్ల తిరుగుతూ పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు.
బీహార్ పోలీసులు వచ్చి...
అయితే తాజాగా అనిరుధ్ కోసం బీహార్ పోలీసులు వచ్చారు. ఆన్ లైన్ లో లింకులు పంపించి రెండు కోట్ల రూపాయలు స్వాహా చేసిన ఘటనలో ఇటీవలబీహార్ పోలీసులు అనిరుధ్ పై కేసు నమోదు చేశారు. దీంతో అనిరుధ్ స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా అని తెలుసుకుని అక్కడికి బీహార్ పోలీసులు వచ్చారు. అచ్చంపేట పోలీసుల సహకరాంతో నిందితుడు అనిరుధ్ ఇంటికి వెళ్లి బీహార్ పోలీసులు వివరాలు సేకరించారు.అయితే అనిరుధ్ ఒక్కడే ఈ సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నాడా? మరేదైనా గ్యాంగ్ ఇతని వెనక ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనిరుధ్ కోసం పోలీసులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. వారి ఫోన్ నెంబర్లను కూడా తీసుకుని పరిశీలించారని తెలిసింది.
Next Story