Tue May 06 2025 06:52:02 GMT+0530 (India Standard Time)
భారీ అగ్ని ప్రమాదం.. పథ్నాలుగు మంది మృతి
కోల్ కత్తాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ కోల్ కత్తాలోని ఒక హోటల్ లో మంటలు చెలరేగడంతో పథ్నాలుగు మంది మరణించారు.

కోల్ కత్తాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ కోల్ కత్తాలోని ఒక హోటల్ లో మంటలు చెలరేగడంతో పథ్నాలుగు మంది మరణించారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ పథ్నాలుగు మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు, పోలీసులు కూడా పథ్నాలుగు మృతదేహాలను బయటకు తీసుకు వచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
మంటలు అదుపులోకి వచ్చినా...
మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినా పథ్నాలుగు మంది మరణించిన ఘటన విషాదం నింపింది. ఈ ఘటన దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
Next Story