Tue Jul 22 2025 03:13:21 GMT+0530 (India Standard Time)
పాట్నాలో కాల్పులు.. ఖైదీపై నలుగురు
బీహార్ రాజధాని లోని పాట్నాలో కాల్పుల కలకలం రేగింది

బీహార్ రాజధాని లోని పాట్నాలో కాల్పుల కలకలం రేగింది. ఆసుపత్రిలో కొందరు దుండగులు కాల్పులకు తెగపడ్డారు. పాట్నాలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో పెరోల్ ఉన్న ఖైదీ చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆసుపత్రిలోకి నేరుగా వచ్చిన నలుగురు దుండగులు నేరుగా ఆసుపత్రిలోని అతని రూములోకి వెళ్లారు. వెళ్లడం వెంటనేకాల్పులు జరిపారు.
నలుగురు వచ్చి...
రూములోకి వెళ్లిన వెంటనే కాల్పులు జరిపారు. పాట్నాలోని శాస్త్రినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరాస్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఆసుపత్రిలోకి నలుగురు వ్యక్తులు వచ్చి పెరోల్ పై వచ్చి చికిత్స పొందుతున్న ఖైదీ చందన్ మిశ్రాపై కాల్పులు జరిపారు. చందన్ గతంలో హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రత్యర్థులు చందన్ మిశ్రాపై కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.
Next Story