Tue Jul 22 2025 03:04:30 GMT+0530 (India Standard Time)
Cyber Crime : డిజిటల్ అరెస్ట్ తో మరో మహిళకు టోకరా.. ఇద్దరిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
డిజిటల్ అరెస్ట్ పేరుతో హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ ఆస్తులను తాకట్టు పెట్టిన ఘటన బయటకు వచ్చింది

ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఎన్ని ప్రకటనలు విడుదల చేస్తున్నా... సైబర్ క్రైమ్ లు మాత్రం ఆగడం లేదు. సైబర్ నేరగాళ్లు అమాయకులను వల వేసి మరీ ఎంచుకుని ఛీటింగ్ కు పాల్పడుతున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో అనేక మందిని మోసం చేసిన ఘటనలు వెలుగు చూసినా అవి మాత్రం ఆగడం లేదు. తాజాగా డిజిటల్ అరెస్ట్ పేరుతో హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ ఆస్తులను తాకట్టు పెట్టిన ఘటన బయటకు వచ్చింది. అయితే ఈ కేసులో ప్రముఖ నాట్యాచార్యుడు పేర్ని రాజకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆస్తులను తాకట్టు పెట్టించి...
రాజ్ కుమార్ సైబర్ నేరగాళ్లకు ఫేక్ అకౌంట్లు అందించడంలో ముఖ్యపాత్ర పోషించారని కేసు నమోదు చేశారు. అంతేకాదు దుబాయ్ కు పారిపోతున్న సమయంలో ముంబయి ఎయిర్ పోర్టులో ఈ కేసులో మరో కీలక సూత్రధారి అల్లుడాస్ సుధాకర్ ను అరెస్ట్ చేశారు. రాజ్ కుమార్, అల్లుడాస్ సుధాకర్ లు అనేక మందిని ఇండియాలో మోసం చేశారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సైబర్ నేరాలకు ఒడిగట్టారు. అనేక రాష్ట్రాల్లో వీరు అమాయకుల నుంచి సొమ్ములు దండుకుని మోసాలకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటున్నారు.
భయపెట్టి దోచుకుని...
పోలీసులకు అందిన సమాచారం మేరకు డిజిటల్ అరెస్ట్ అంటూ వీరిద్దరూ ఒక మహిళను బెదిరించి డిజిటల్ అరెస్ట్ అంటూ ఆమె ఆస్తులు, బంగారు ఆభరణాలను కూడా తాకట్టు పెట్టించారు. తర్వాత ఫైనాన్స్ సంస్థ ద్వారా నకిలీ ఖాతాల్లోకి మళ్లించారు. ఈ వ్యవహారంలో ముంబయికి చెందిన సైబర్ నేరగాడు సుధాకర్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ నేరగాళ్లకు సమర్పించుకున్నారు. మరో నిందితుడు గోయల్ కు సహకరించినట్లు విచారణలో వెల్లడయింది. బాధితురాలను లక్ష్యంగా చేసుకుని పాల్పడుతున్న నేరగాళ్లను అరెస్ట్ చేయడంతో ఈ ముఠా గుట్టురట్టయ్యే అవకాశాలున్నాయి.
Next Story