Tue Jul 22 2025 03:23:55 GMT+0530 (India Standard Time)
అద్దంకి - నార్కేట్ పల్లి జాతీయ రహదారిపై యాక్సిడెంట్
అద్దంకి - నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

అద్దంకి - నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్లగొండ జిల్లా ఎల్లారెడ్డి గూడెం వద్ద లారీని డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కు తీవ్రగాయాలు కాగా, ప్రయాణికులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.
భారీగా ట్రాఫిక్ జామ్...
అయితే బస్సు, లారీ ఢీకొట్టడంతో అద్దంకి - నార్కేట్ పల్లి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ కు వస్తున్న బస్సు, లారీని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణం నిద్రలేమి, అతివేగమేనని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాఫిక్ ను పోలీసులు క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story