Tue Jul 22 2025 03:26:37 GMT+0530 (India Standard Time)
Murder Mystery : వైష్ణవిని హత్య చేసిందెవరు..? వీడని మర్డర్ మిస్టరీ
కడప జిల్లాలో యువతి మృతిపై మిస్టరీ వీడలేదు. గండికోటకు వెళ్లిన వైష్ణవిని హత్య చేసిందెవరన్న దానిపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు

కడప జిల్లాలో యువతి మృతిపై మిస్టరీ వీడలేదు. గండికోటకు వెళ్లిన యువతిని హత్య చేసిందెవరన్న దానిపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నా ఆధారాలు మాత్రం దొరకడం లేదు. తొలుత ప్రియుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానించినా సీసీ టీవీ ఫుటేజీ ద్వారా పరిశీలన జరిపిన తర్వాత ప్రియుడు లోకేశ్ యువతి వైష్ణవిని గండికోట ప్రాంతంలో వదలి వెళ్లిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఇంతకీ వైష్ణవిని హత్య చేసిందెవరు? ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా? లేక పరువు హత్య జరిగిందా? అన్న కోణంలో ఇంకా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియుడే హత్య చేశాడంటూ...
అయితే వైష్ణవి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె వైష్ణవిని ప్రియుడు లోకేశ్ హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. గండికోటలో రెండు గంటల పాటు ఏం జరిగిందన్న దానిపై మాత్రం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరూ బైక్ మీద గండికోట వైపు వెళ్లడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించడంతో వారి మధ్య విభేదాలు లేవని, తిరిగి వెంటనే వెళ్లిపోవడంతో ఎవరినైనా చూసి వైష్ణవిని అక్కడ దింపేసి లోకేశ్ వెళ్లిపోయాడా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ అందుకు వైష్ణవి తల్లిదండ్రులు మాత్రం అందుకు అంగీకరించలేదు.
అన్ని కోణాల్లో...
నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి వైష్ణవిని హత్య చేయడంతోనే మృతి చెందినట్లు బలమైన ఆధారాలున్నాయి. వైష్ణవి శరీరంపై ఉన్న గాయాలు హత్య అని నిర్ధారణ చే్స్తున్నాయి. అయితే వైష్ణవిని లవర్ హత్య చేయిమని ఎవరికైనా పురమాయించి అక్కడ దింపి వెళ్లాడా? అన్న అనుమానం కూడా వ్యక్తమవుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా లోకేశ్ ప్రమేయం లేదని చెప్పారు. దీంతో ఇప్పుడు పరువు హత్య కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగి ఇన్ని రోజులవుతున్నా నిందితులను ఎవరో తేల్చకపోవడంతో మిస్టరీ తేలలేదు. పోలీసుల మాత్రం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు, రేపట్లో వివరాలను వెల్లడించే అవకాశముంది.
Next Story