Tue May 06 2025 17:01:56 GMT+0530 (India Standard Time)
Telangana : హమ్మయ్య వీడు దొరికేశాడు.. ఇక హాయిగా నిద్రపోవచ్చు.. కరడుగట్టిన నేరగాడు అరెస్ట్ తో?
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరడు గట్టిన నేరగాడుగా పోలీసులు గుర్తించిన సంపంగి శ్రీను ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

నేరగాళ్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టయిల్ ఉంటుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కు ఒక ప్రత్యేకత ఉంటుంది. వారు కొన్ని పనులు చేసి సులువుగా దొరికిపోతారు. మరొకవైపు జనం కంటి మీద కునుకులేకుండా చేస్తారు. అలాంటి నేరగాళ్లు బయట ఉంటే ప్రజలు బితుకు బితుకుమంటూ బతకాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరడు గట్టిన నేరగాడుగా పోలీసులు గుర్తించిన సంపంగి శ్రీను అలియాస్ శ్రీను ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కూలీకి వెళ్లే మహిళలనే...
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీను కూలీలకు వెళ్లే మహిళలను లక్ష్యంగా ఎంచుకునే వాడు. వారికి తమ వద్ద పని ఉందని చెప్పి బైక్ మీదకు ఎక్కించుకుని వెళ్లేవాడు. పనికోసమని గుడ్డిగా శ్రీను ను నమ్మి మహిళలు వెళ్లే వారు. అయితే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి త్తులతో వారిని బెదిరించి బంగారంతో పాటు డబ్బును కూడా అందిన కాడికి దోచుకునేవాడు. పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించి పరారయ్యేవాడు. శ్రీనుపై రెండు తెలుగు రాష్టాల్లో పదికి పైగానే కేసులు నమోదయ్యాయి. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు.
ఫోన్లు, పేర్లు మారుస్తూ...
అయినా శ్రీను జాడ దొరకలేదు. గత నాలుగు నెలల్లోనే పది మందిని దోచుకోవడంతో పోలీసులకు సవాల్ గా మారాడు. శ్రీను గతంలో తన భార్యను చంపి జైలుకు వెళ్లి వచ్చాడు. అంటే ఘనమైన నేరచరిత్ర ఉన్న శ్రీనును ఎట్కేలకు పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా పోలీసులు శ్రీను కోసం ప్రయత్నిస్తున్నా ఫోన్ నెంబర్లు మారస్తూ, పేర్లు మార్చుకుంటూ తిరుగుతున్నాడు. ఎట్టకేలకు రాజేంద్ర నగర్ పోలీసులు పట్టుకున్నారు. దీంతో శ్రీను పట్టుబడటంతో ఇక మహిళలు హాయిగా తమ పనులు చేసుకోవచ్చు.
Next Story