Tue May 06 2025 09:09:12 GMT+0530 (India Standard Time)
ఒంగోలు హత్య కేసులో వీడిన మిస్టరీ.. వీరయ్య చౌదరిని హతమార్చింది ప్లాన్ ప్రకారమే?
ఒంగోలులో జరిగిన వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారు

ఒంగోలులో జరిగిన వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వీరయ్య చౌదరి హత్యకు కుట్ర పన్నిన వారిని కనుగొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వీరయ్య చౌదరి అంతిమ సంస్కారాలకు హాజరు కావడంతో పాటు వెంటనే నిందితులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించడంతో ప్రకాశం జిల్లా పోలీసులు తీవ్రంగా శ్రమించి ఈ హత్య కేసును ఛేదించినట్లు తెలిసింది. అయితే వీరయ్య చౌదరి హత్యకు గల కారణాలు ఇంకా అధికారికంగా పోలీసులు వెల్లడించకపోయినప్పటికీ ఆర్థిక లావాదేవీలతో పాటు, మద్యం షాపులు, చేపల చెరువల వేలం విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు గల కారణాలుగా పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది.
అనుమానితులుగా ఉన్న....
అయితే ఈ కేసులో అనుమానితులుగా ముప్పవరపు సురేష్, వీరగంధం దేవేంద్రనాద్ చౌదరీలను పోలీసులు గుర్తించారు. వీరిద్దరికి చెందిన చేపల చెరువులు, మద్యం షాపుల విషయంలో వీరయ్య చౌదరి తో తలెత్తిన వివాదమే హత్యకు దారి తీసినట్లు దాదాపుగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. వీరగంధం దేవేంద్రనాద్ చౌదరీ కి చెందిన రొయ్యల చెరువులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి వీరయ్య చౌదరి. నిలుపుదల చేయించడంతో కక్ష పెంచుకుని ఈ హత్యకు కుట్ర పన్నారని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ చర్యలతో దేవేంద్ర నాధ్ కు దాదాపు రెండు కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిడంతోనే వీరయ్య చౌదరి హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది.
మద్యం దుకాణాలను టార్గెట్ చేసి...
రొయ్యల చెరువులతో పాటు వీరగంధం దేవేంద్రనాద్ చౌదరీకి చెందిన రెండు మద్యం దుఖానాలపై తరుచుగా పోలీసులతో దాడులు చేయించి ఆర్దికంగా దెబ్బతీసి చివరకు నాగులుప్పలపాడు లోని మద్యంషాపుతో పాటు మరో షాపును తన చేతుల్లోకి వచ్చేలా చేయడంతో దేవంద్రనాధ్ వీరయ్య చౌదరి పై కక్ష మరింత పెంచుకున్నాడు. తనను ఆర్థికంగా దెబ్బతీస్తున్న వీరయ్య చౌదరిని అంతమొందించాలన్న లక్ష్యంతో ఒక పథకం ప్రకారం సుపారీ ఇచ్చి వీరగంధం దేవేంద్రనాధ్ తో పాటు ముప్పవరపు సురేష్ లు కలసి వీరయ్య చౌదరి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు దాదాపుగా నిర్ధారించారు.
ఆర్థిక లావాదేవీలే...
దేవేంద్రనాద్ చౌదరి కి ఉన్న ముప్పవరపు సురేష్ ఆర్థికంగా పెట్టుబడులు పెడుతూ భాగస్వామిగా ఉండటంతో సురేష్ కూడా నష్టపోయి చితికిపోయడు. ముప్పవరపు సురేష్ విదేశాల్లో ఉంటూ బంగారం వ్యాపారం చేస్తుంటాడని పోలీసులు కనుగొన్నారు. చీమకుర్తి లోని ఆర్ ఎస్ ఫ్యామిలీ డాబా వద్ద దొరికిన స్కూటీ ఛాసిస్ నంబర్ ఆధారంగా అడ్రస్ ట్రేస్ చేసిన పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. పోలీసులకు దొరికిన స్కూటీ వీరగందం దేవేంద్రనాద్ చౌదరి బావమరిదిగా గుర్తించిన పోలీసులు వీరగంధం దేవేంద్ర నాధ్ వీరయ్య చౌదరి మద్య పాతపగలు ఉండటంతోనే హత్య జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ప్రత్యర్దిపై అనుమానంతో దేవేంద్రనాద్ చౌదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హత్యలో పాల్గొన్న ఓ నిందితుడిని విశాఖపట్నం ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Next Story