Fri Apr 03 2026 18:09:36 GMT+0530 (India Standard Time)
Road Accident : తెలంగాణలో ఘో రోడ్డు ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

తెలంగాణలో ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్ను ఆటోను అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
పలువురికి గాయాలు...
ఆటో బోల్తా పడటంతో పలువురు హనుమాన్ భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

