Tue Jul 22 2025 03:20:57 GMT+0530 (India Standard Time)
Road Accident : అవుటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి స్పాట్ డెడ్
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పెద్ద అంబర్ పేట్ నుంచి బొంగ్లూరు వెళుతున్న బలేనో కారు ఆధిభట్ట వద్దకు రాగానే అదుపు తప్పి లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అందులో మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. అతి వేగంతో వెళుతున్న కారణంగానే కారకు అదుపులోకి రాలేక వెనక నుంచి లారీని ఢీకొట్టిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ణయించారు.
అతి వేగంగా వచ్చి...
అవుటర్ రింగ్ రోడ్డుపెట్రోలింగ్ టీం ఇచ్చిన సమాచారం మేరకు ఆదిభట్ల పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కారులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని మాత్రం ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. మృతులు మలోత్ చందులాల్, గులోత్ జనార్థన్ కావలి బాలరాజులుగా గుర్తించారు. వీరంతా మొయినా బాద్ గ్రీన్ వాలీ రిసార్ట్ లో పనిచేసే వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story