Tue May 06 2025 08:24:48 GMT+0530 (India Standard Time)
రాయలసీమ ఎక్స్ ప్రెస్‌లో దోపిడీ
అనంతపురం జిల్లా గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్ ప్రెస్‌లో దోపిడీకి దుండగులు పాల్పడ్డారు

అనంతపురం జిల్లా గుత్తి వద్ద రాయలసీమ ఎక్స్ ప్రెస్‌లో దోపిడీకి దుండగులు పాల్పడ్డారు. గుత్తి వద్ద ఆగి ఉన్న రైలులోకి చొరబడిన ఐదుగురు దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. అమరావతి ఎక్స్ ప్రెస్ లైన్ క్లియర్ కోసం రాయలసీమ ఎక్స్ ప్రెస్ ను స్టేషన్ లో నిలపడంతో దుండగులు రైలులోకి ప్రవేశించారు. మొత్తం పది బోగిల్లో దోపిడీకి పాల్పడ్డారు. నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ ప్రెస్‌లో ఈ దోపిడీ జరిగింది.
ఆగిఉన్న రైల్లోకి ప్రవేశించి...
అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు లైన్‌క్లియర్ చేసేందుకు గుత్తి శివారులో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు. ఈ సమయంలోనే దుండగులు ఆ రైలులోకి మొత్తం బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. దీంతో బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story