పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ.. అడ్డంగా దొరికిన సైనికుడు
పాకిస్తాన్ ఐఎస్ఐ కు సైనిక రహస్య సమాచారాన్ని లీక్ చేసినందుకు పంజాబ్ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక ఆపరేషన్

పాకిస్తాన్ ఐఎస్ఐ కు సైనిక రహస్య సమాచారాన్ని లీక్ చేసినందుకు పంజాబ్ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక ఆపరేషన్ సెల్ భారత సైన్యంలో పనిచేస్తున్న ఒక సైనికుడిని అరెస్టు చేసింది. నిందితుడిని సంగ్రూర్ జిల్లాలోని నిహల్‌గఢ్ గ్రామానికి చెందిన దేవిందర్ సింగ్‌గా గుర్తించారు. జమ్మూ కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉరిలో అతన్ని అరెస్టు చేశారు.
గూఢచర్యం ఆరోపణలపై మాజీ సైనికుడు గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గుర్రిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా.. దేవీందర్ సింగ్ కు సంబంధించిన సమాచారం బయటపడింది. దేవిందర్ దగ్గర సైన్యానికి సంబంధించిన సున్నితమైన పత్రాలు ఉన్నాయి. ఈ పత్రాలలో రహస్య సమాచారం ఉందని, దానిని అతను పాకిస్తాన్ ఐఎస్ఐకి అందజేశాడని ఆరోపించారు. ప్రాథమిక దర్యాప్తులో దేవిందర్, గుర్ప్రీత్ 2017లో పూణేలోని ఆర్మీ క్యాంప్‌లో శిక్షణ పొందుతున్నప్పుడు మొదటిసారి కలిశారు. దీని తర్వాత కూడా ఇద్దరూ టచ్‌లో ఉన్నారు.