Tue May 06 2025 08:07:05 GMT+0530 (India Standard Time)
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ జరిగింది.

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ జరిగింది. విశాఖ నుంచి హైదరాబాద్ కు వచ్చిన గోదావరి ఎక్స్ ప్రెస్ లో ఒక భారీగా బంగారాన్ని దుండగులు చోరీ చేశారు. గోదావరి ఎక్స్ ప్రెస్ లోని ఏ1 కోచ్‌లో 11 తులాల బంగారం చోరీ చేసిన దుండగులు వాటిని కాజేసి తప్పంచుకుని పారిపోయారు. దీంతో బంగారం కోల్పోయిన ప్రయాణకులు లబోదిబోమంటున్నారు.
పదకొండు తులాల బంగారాన్ని...
దీంతో బాధితులు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన గోదావరి ఎక్స్‌ప్రెస్ లో ఈ చోరీ జరిగిందని, ముందుగానే గమనించిన దోపిడీ దొంగలు ఒక పథకం ప్రకారం ఈ పెద్దయెత్తున బంగారాన్ని దోచుకుని వెళ్లి ఉంటారని ప్రాధమికంగా అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story