Tue May 06 2025 08:43:48 GMT+0530 (India Standard Time)
తిరువనంతపురం ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
తిరువనంతపురం ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది.

తిరువనంతపురం ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఎయిర్ పోర్టులో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈమెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో బాంబ్ స్క్కాడ్ ఎయిర్ పోర్టు మొత్తం తనిఖీలను నిర్వహించారు. అణువణువునా పరిశీలించారు. ప్రయాణికుల లగేజీతో పాటు అన్ని ఏరియాల్లో తనిఖీలను నిర్వహించారు.
బెదిరింపులు రావడంతో
ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో ఎవరు బెదిరింపులు చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. విమానాల రాకపోకలకు ఆలస్యం అయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. టెర్మినళ్లు సహా ఎయిర్పోర్టు మొత్తం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ బెదిరింపు మెయిల్ ఎవరు పంపారన్న దానిపై విచారణ చేస్తున్నారు.
Next Story