Tue May 06 2025 07:44:23 GMT+0530 (India Standard Time)
చెరువులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి
ఈత నేర్చుకోవడానికి వెళ్లి చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మరణించిన ఘటన తెలంగాణలో జరిగింది

ఈత నేర్చుకోవడానికి వెళ్లి చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మరణించిన ఘటన తెలంగాణలో జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన ధర్మారెడ్డి కుమారుడు గణేశ్, కుమార్తె రక్షిత హైదారాబాద్ లో హాస్టలో ఉండి చదువుకుంటున్నారు. వీరు ఏడు, ఐదో తరతగి చదువు పూర్తి చేసుకున్నారు. వేసవి సెలవులు రావడంతో ఇంటికి వచ్చిన వీరు తమ ఇంటికి సమీపంలోని శ్రావణ్ కుమార్ తో కలసి పెద్దకొత్తపల్లిలోని చెరువు వద్దకు వెళ్లారు.
ఈత నేర్చుకుందామని...
ఈత నేర్చుకుందామని వెళ్లిన వీరు చెరువులో దిగడంతో ముందు శ్రావణ్ కుమార్ నీటిలో మునిగిపోవడంతో రక్షిత, గణేశ్ లు కూడా అతనిని రక్షించేందుకు ప్రయత్నించగా వారు కూడా చెరువులో మునిగిపోయారు. దీంతో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story