Fri Mar 20 2026 01:35:48 GMT+0530 (India Standard Time)
రంగారెడ్డి జిల్లాలో విషాదం.. ముగ్గురి మృతి
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గండిపేట్ మండలంలోని ఇస్తాం చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం… ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన ముగ్గురు యువకులు లోతైన నీటిలో మునిగిపోయారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోస్టు మార్టం నిమిత్తం...
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో చెరువులో గాలింపు చేపట్టి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Next Story

