Tue Jul 22 2025 03:29:23 GMT+0530 (India Standard Time)
Planed Murder : సాంబారులో విషం కలిపి.. భర్త చచ్చాడంటూ మెసేజ్ పెట్టి?
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ఒక భార్య తమిళనాడులో భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది.

భార్యలు... భర్తలను హత్య చేయడం ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. మేఘాలయ హనీమూన్ మర్డర్ తర్వాత దేశంలోని అనేక ప్రాంతాల్లో భార్యలు భర్తలను హతమారుస్తున్న ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. ప్రాంతాలతో పనిలేదు. మతాలతో సంబంధం లేదు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తలను తొలగించుకుంటున్నారు. ప్రియుడితో కలసి భర్తల ప్రాణాలను తీసేస్తున్నారు. తాజాగా తమిళనాడులోనూ ఇలాంటి ఘటన జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ఒక భార్య తమిళనాడులో భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. పక్కా ప్లాన్ ప్రకారం చేతికి మట్టి అండకుండా చంపాలని ప్రయత్నించింది కానీ.. అడ్డంగా దొరికిపోయింది.
ఇద్దరు సంతానం...
తమిళనాడులోని దర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామంలో గరసూ, అమ్ముబీ దంపతులు నివాసముంటున్నారు. రసూల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అమ్ముబీకి లోకేశ్వరన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరూ తరచూ కలుసుకునే వారు. భర్త డ్యూటీకి వెళ్లినప్పుడు వీరు కలుసుకునే వారు. కానీ భర్త ఇంట్లో ఉంటే మాత్రం కలుసుకోలేకపోయేవారు. రసూల్, అమ్ముబీకి ఇద్దరు పిల్లలున్నారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రసూల్, అమ్ముబీకి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
దానిమ్మ రసంలో కలిపి...
ఇద్దరి మధ్య గొడవలు లోకేశ్వరన్ తో పరిచయం పెంచాయి. పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఇద్దరి విషయం రసూల్ దృష్టికి రావడంతో గొడవలు మరింత పెరిగాయి. రోజూ భార్యాభర్తలు గొడవపడేవారు. అయితే ఇద్దరినీ రసూల్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో భర్తను లేపేయడానికి లోకేశ్వరన్, అమ్ముబీ స్కెచ్ వేశారు. దానిమ్మ రసంలో పురుగుమందు కలిపి ఇచ్చింది. అయితే రసూల్ తాగలేదు. కానీ తర్వాత సాంబార్ లో పురుగుల మందు కలిపి ఇచ్చింది.
వాయిస్ మెసేజ్ లు చూసి...
దీంతో రసూల్ అస్వస్థతకు గురై మృతి చెందాడు. రసూల్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అమ్ముబీ ఫోన్ తో పాటు లోకేశ్వరన్ ఫోన్లను కూడా పరిశీలించారు. ఇద్దరి మధ్య వాయిస్ మెసేజ్ లు ఉన్నాయి. నువ్వు ఇచ్చిన విషాన్ని దానిమ్మ రసంలో కలిపానని, తాగలేదని, అందుకే సాంబారులో కలిపి పెట్టానని అమ్ముబీ చెప్పింది. దీంతో అది తిన్న రసూల్ చచ్చాడంటూ వాయిస్ మెసేజ్ పోలీసులకు చిక్కడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story