Fri Mar 20 2026 06:43:01 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలకు వెళ్లే వారికి హై అలెర్ట్
తిరుమలలో భక్తుల నేడు రద్దీ పెరిగింది

తిరుమలలో భక్తుల నేడు రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ నేడు మరింతగా పెరిగింది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. తిరుమలకు గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. శుక్రవారం కావడంతో మరింత ఎక్కువయింది. సోమవారం వరకూ ఇదే రద్దీ కొనసాగుతుందని, తిరుమలకు వచ్చే భక్తులు వసతి విషయంలో కొంత ఆలస్యమవతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
లగేజీ కౌంటర్ ను...
భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే సమయంలో తమ లగేజిని కౌంటర్లో డిపాజిట్ చేయగా, వాటిని భద్రంగా తిరుమలకు తరలించే విధానంపై ఈవో పరిశీలించారు. లగేజి డిపాజిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా రూపొందే క్యూఆర్ కోడ్‌తో కూడిన రసీదు భక్తులకు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు.సాధారణ రోజుల్లో సుమారు ఆరు వేల బ్యాగులు, ప్రత్యేక పర్వదినాల్లో 10 వేల వరకు బ్యాగులు తిరుమలకు భద్రంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
బయట వరకూ క్యూ లైన్...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,756 మంది భక్తులు దర్శించుకున్నారు.
Next Story

