Fri Mar 20 2026 03:40:36 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి భద్రాద్రిలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి

నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా మిథిలా మండపంలో సీతారామ కల్యాణోత్సవం జరగనున్న నేపథ్యంలో నేటి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఉగాది నాడు...
ఇప్పటికే సీతారాముల కల్యాణోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు. ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి రానున్నారు. మరొకవైపు ఉగాది పర్వదినం కావడంతో ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారు. భద్రాచలంలో ఏప్రిల్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
Next Story

