ఫ్యాక్ట్ చెక్: పాకిస్థాన్ సైన్యం భారత్ కు చెందిన రాఫెల్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసిందంటూ అసత్య ప్రచారం జరుగుతోంది
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారతదేశం కఠిన చర్యలు తీసుకున్న కొన్ని రోజుల తర్వాత,

Claim :
పాకిస్తాన్ సైన్యం భారత్ కు చెందిన రాఫెల్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసింది.Fact :
వైరల్ వీడియో జూన్ 2024 నుండి ఆన్లైన్లో ఉంది. మహారాష్ట్రలోని నాసిక్‌లో సుఖోయ్ ఫైటర్ జెట్ కూలిపోవడాన్ని చూపిస్తుంది.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారతదేశం కఠిన చర్యలు తీసుకున్న కొన్ని రోజుల తర్వాత, పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ (LOC) వద్ద కాల్పులు ప్రారంభించింది. పాకిస్తాన్ సైన్యం పలు ప్రాంతాల్లో కాల్పులు ప్రారంభించిందని భారత సైన్యం చెబుతోంది. భారత సైన్యం ప్రతిగా కాల్పులు జరిపింది. ఇప్పటివరకు, భారతదేశం వైపు ఎవరూ గాయపడలేదు. పాకిస్తాన్ సైనిక పోస్టుల సమీపంలోని గ్రామాల ప్రజలు బంకర్లను శుభ్రం చేయడం ప్రారంభించారు. సరిహద్దు సమీపంలోని గ్రామాల ప్రజలు కూడా అత్యవసర సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మొదలైన కాల్పుల కారణంగా గ్రామస్తులు ప్రస్తుతం భయం భయంగా బతుకుతున్నారు, పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని అంటున్నారు. పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. ప్రభుత్వం పౌరులను జాగ్రత్తగా ఉండాలని కోరింది.