Tue May 06 2025 10:06:43 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: పాకిస్థాన్ కు చెందిన 1026 మందిని హైదరాబాద్ లో పట్టుకున్నారంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు
వైరల్ వీడియో గుజరాత్ కు చెందినది

Claim :
హైదరాబాద్ లో 1026 మంది పాకిస్థానీలను పోలీసులు పట్టుకున్నారుFact :
వైరల్ వీడియో గుజరాత్ కు చెందినది. వారంతా పాకిస్థానీలు కాదు
పాకిస్థానీలు భారత్ నుండి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వైద్య వీసాల చెల్లుబాటు చివరి రోజుతో కలిసి ఏప్రిల్ 29, 2025న భారతదేశం నుండి అట్టారి సరిహద్దు ద్వారా పాకిస్తాన్ జాతీయుల నిష్క్రమణ పెరిగింది. పాకిస్తాన్ జాతీయులకు స్వల్పకాలిక వీసాల చెల్లుబాటు ఇప్పటికే ముగిసిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పాకిస్తాన్ జాతీయులు భారతదేశం విడిచి వెళ్లాలనే నోటీసు అమలులో ఉన్నందున, ప్రభుత్వ గడువు ప్రకారం దేశం విడిచి వెళ్లని ఏ పాకిస్తానీనైనా అరెస్టు చేసి విచారిస్తారు. వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా 3 లక్షల రూపాయలు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు 26 మందిని చంపిన తర్వాత భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ చట్టం 2025 ప్రకారం, గడువు ముగిసిపోయినా, వీసా షరతులను ఉల్లంఘించినా లేదా నిషేధిత ప్రాంతాలలో అతిక్రమించినా మూడేళ్ల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.
సార్క్ వీసాలు కలిగి ఉన్నవారికి ఏప్రిల్ 26 చివరి తేదీ కాగా, మెడికల్ వీసాలు ఉన్నవారికి ఏప్రిల్ 29 చివరి తేదీ. 12 రకాల వీసాలు — వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకుడు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికుడు, గ్రూప్ యాత్రికుడు లాంటి వీసాలు కలిగి ఉన్న వాళ్లు భారత్ ను వీడాల్సిందే.
అయితే హైదరాబాద్ నగరంలో ఏకంగా 1026 మంది పాకిస్థానీలను పోలీసులు పట్టుకున్నారనే వాదనతో కొన్ని పోస్టులను వైరల్ చేస్తున్నారు. "హైదరాబాద్ లో పిల్లలతో సహా 1026 మంది పాకిస్తాన్ వాళ్ళని బైటికి తీశారు . ఇంకెంత మంది ఉన్నారో" అంటూ పోస్టు పెట్టారు. పెద్ద ఎత్తున ప్రజలు నడుచుకుంటూ వెళుతూ ఉండగా, వారి చుట్టూ పోలీసులు కూడా వైరల్ వీడియోలో ఉన్నారు.
https://x.com/i/status/1916170587010949271
సార్క్ వీసాలు కలిగి ఉన్నవారికి ఏప్రిల్ 26 చివరి తేదీ కాగా, మెడికల్ వీసాలు ఉన్నవారికి ఏప్రిల్ 29 చివరి తేదీ. 12 రకాల వీసాలు — వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకుడు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికుడు, గ్రూప్ యాత్రికుడు లాంటి వీసాలు కలిగి ఉన్న వాళ్లు భారత్ ను వీడాల్సిందే.
అయితే హైదరాబాద్ నగరంలో ఏకంగా 1026 మంది పాకిస్థానీలను పోలీసులు పట్టుకున్నారనే వాదనతో కొన్ని పోస్టులను వైరల్ చేస్తున్నారు. "హైదరాబాద్ లో పిల్లలతో సహా 1026 మంది పాకిస్తాన్ వాళ్ళని బైటికి తీశారు . ఇంకెంత మంది ఉన్నారో" అంటూ పోస్టు పెట్టారు. పెద్ద ఎత్తున ప్రజలు నడుచుకుంటూ వెళుతూ ఉండగా, వారి చుట్టూ పోలీసులు కూడా వైరల్ వీడియోలో ఉన్నారు.
https://x.com/i/status/
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు:
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా హైదరాబాద్ నగరంలో 200 మందికి పైగా పాకిస్థానీలు ఉన్నారని, వారందరికీ నోటీసులు పంపినట్లుగా పోలీసులు చెప్పిన నివేదికలు లభించాయి.
"208 Pakistani nationals staying in Telangana, mostly in Hyderabad: DGP" అంటూ హిందూస్తాన్ టైమ్స్ లో కథనం మాకు లభించింది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ఉంటున్న పాకిస్తానీ పౌరులందరూ తమ దేశానికి వెళ్లిపోవాలని, ఏప్రిల్ 27 నాటికి వారి వీసాలు రద్దు అవుతాయని తెలంగాణ ప్రభుత్వం కోరింది. పాకిస్తానీ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్తానీ జాతీయులకు జారీ చేసిన వైద్య వీసాలు ఏప్రిల్ 29 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని అన్నారు. తెలంగాణలో ఉంటున్న పాకిస్తానీ జాతీయులు మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. అధికారిక రికార్డుల ప్రకారం, 208 మంది పాకిస్తానీ జాతీయులు తెలంగాణలో నివసిస్తున్నారని, ఎక్కువగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారని DGP తెలిపారు. వారిలో 156 మంది దీర్ఘకాలిక వీసాలను కలిగి ఉన్నారు, భారతీయ పౌరులను వివాహం చేసుకున్న వారికి లేదా ఇక్కడ రక్త సంబంధాలు కలిగి ఉన్న వారికి వీసాలు జారీ చేశారని ఆ కథనం తెలిపింది.
పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని నివేదించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియో హైదరాబాద్ కు చెందినది కాదని తేలింది.
వైరల్ వీడియోతో సరిపోలే విజువల్స్ ను ahmedabad_live అనే ఇన్‌స్టా పేజీలో "Massive Pre-Dawn Crackdown in Gujarat: Over 500 illegal immigrants—mainly from Bangladesh and Pakistan—were detained in Ahmedabad during a 3 am combing operation led by DCP Ajit Rajian and teams from the Crime Branch, SOG, EOW, and Zone 6. Similar coordinated drives in Surat, Vadodara, and other cities brought the statewide total to nearly 1,000. In Ahmedabad, detainees were gathered at Kankaria football ground for verification. #police #ahmedabad #gujaratpolice #ahmedabadlive #ahmedabad_instagram #amdavad #ahemdabad #ahmedabadcity #trendingreels #ahmedabadlivenews #hews #newsupdates #ahmedabadnews #ahmedabaddiaries" అనే టైటిల్ తో అప్లోడ్ చేశారు.
500 మందికి పైగా విదేశీయులు గుజరాత్ లో అక్రమంగా నివసిస్తున్నారని ఈ వీడియో టైటిల్ ద్వారా తెలుస్తోంది. దీన్ని క్యూ గా తీసుకుని మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం.
వందల సంఖ్యలో గుజరాత్ రాష్ట్రంలోని పలు నగరాల్లో అక్రమ వలసదారులు తిరుగుతున్నారని పలు మీడియా సంస్థలు నివేదించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
గుజరాత్లో దాదాపు 450 మంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు నిర్ధారించారని, పెద్ద ఎత్తున పోలీసు దాడుల ఫలితంగా దాదాపు 6,500 మంది పత్రాలు లేని వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారని మీడియా కథనాల్లో తేలింది. అహ్మదాబాద్, సూరత్‌లలో సోదాల తర్వాత, గుజరాత్ అంతటా ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించామని, అక్రమ బంగ్లాదేశ్ వలసదారులుగా అనుమానిస్తున్న సుమారు 6,500 మందిని అదుపులోకి తీసుకున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) వికాస్ సహాయ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రస్తుతం వారి గుర్తింపులను ధ్రువీకరిస్తున్నారు.
ఇక వైరల్ వీడియోతో పోలిన పలు వీడియోలను మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో హైదరాబాద్ కు చెందినది కాదు. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది.
వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
Claim : వైరల్ వీడియో గుజరాత్ కు చెందినది
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : False
Next Story